ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి 

ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...

ఆశ వర్కర్ల యూనియన్  రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్.సీఐటీయూ సభ్యులు చాపల  రమేష్ 

లోకల్ గైడ్, గండిపేట్:

ప్రతినిత్యం ప్రజా సేవలో ఉంటూ ఆరోగ్య సేవలు చేస్తున్న  ఆశా వర్కర్లకు పారితోషకాలను  వెంటనే చెల్లించాలని సిఐటియు  సభ్యులు రమేష్, ఆశా వర్కర్లు  ఆశా వర్కర్ అండ్ ఎంప్లాయ్ కార్మికుల  మెడికల్ అధికారికి ఓ వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు చాపల రమేష్ మాట్లాడుతూ... ఆశా వర్కర్లకు  జులై నెల  పారితోషకాలను వెంటనే చెల్లించాలని  ఆగస్టు నెలలో పారితోషకాలు ఆలస్యం చేయకుండా  గతంలో చెల్లించినట్లు  సకాలంలో చెల్లించాలని అన్నారు. ఫిక్స్డ్ వేతనం  రూ. 18000 /- లు, 2023 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో  రాష్ట్రవ్యాప్తంగా  15 రోజులపాటు  ఆశ వర్కర్లు  నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆనాటి ఉన్నతాధికారులు  ఆశ యూనియన్( సిఐటియు) రాష్ట్ర కమిటీతో  చర్చలలో ఇచ్చిన కొన్ని నిర్దిష్టమైన  హామీలను ఇప్పటికీ అనేకసార్లు  రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలతో పాటు  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో  ఆశా వర్కర్లకు  వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని  పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం కోఠి వద్ద జరిగిన ధర్నాల సందర్భంగా  రాష్ట్ర ఉన్నత అధికారులు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్  ఇస్తామని, మట్టి ఖర్చులు 50 వేల రూపాయలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్ లు, సెలవులను ఇస్తామని, టార్గెట్ రద్దు చేస్తామని, ప్రమోషన్స్ కల్పిస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. వెంటనే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలకు సిద్ధం అవుతామని  వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్ యూనియన్  గండిపేట మండల నాయకురాలు శంకరమ్మ, లత, శ్రీదేవి, కవిత, పద్మ, సులోచన, మమత, అలాగే వీరితోపాటు  మంచిరేవుల ఎక్స్ రోడ్ గచ్చిబౌలి  రూట్ ఆటో డ్రైవర్స్ యూనియన్  కార్యదర్శి గునుగుర్తి పద్మారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్ 
ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...
గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*
అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు