అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు

అంబు రామేశ్వర జాతరకు పోటెత్తిన భక్తులు. కిక్కిరిసిపోయిన జనం. 

అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు

ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. 

లోకల్ గైడ్/ తాండూర్:

పెద్దేముల్ మండల పరిధిలోని తట్టెపల్లి గ్రామ శివారులో గల దట్టమైన అటవి ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన అంబురామేశ్వరుడి జాతర ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో, జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా, పక్క రాష్ట్రాలు.... కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్, తదితర సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో హాజరై, అంబురామేశ్వరుడిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నా.జాతరలో జనం ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సహాయక చర్యలు, అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది ఏర్పాటు చేసి, జాతరకు వచ్చిన భక్తుల మన్నాను పొందారు ఆలయ కమిటీ పాలకమండలి సభ్యులు.ఈ క్రమంలో అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే నెల రోజులపాటు ఉపవాసాలు ఉంటూ ఎంతో భక్తి శ్రద్దలతో స్వామివారికి పూజలు చేసి, నెల రోజులపాటు పస్తులున్న భక్తులు చివరి సోమవారం జాతర కావడంతో ఒక్కపొద్దు విరమించుకుని, స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇదిలా ఉంటే, పవిత్ర శ్రావణమాసం నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి, నీటి వసతులు కల్పించి, నిత్యం అంబురామేశ్వరుడి వద్ద నెల రోజులపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా జాతరను పురస్కరించుకొని తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉడువాల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శాలువా కప్పి స్వాగతించారు.ఈ సమయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాండూర్ నియోజకవర్గ ప్రజలంతా ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలతో చల్లగా ఉండాలని అంబురామేశ్వరుని దర్శించుకున్నారు.అదేవిధంగా భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ఏఎంసీ చైర్మన్ అంజయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, తట్టెపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింలు, అరుణ్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం, వైస్ చైర్మన్ సందీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కోశాధికారి శంకర్ నాయక్, నర్సింలు, నారాయణ గౌడ్, డైరెక్టర్ హనుమంతు, మాజీ డైరెక్టర్ అంజప్ప, సలహాదారులు బాబు సింగ్, శివరాం, గేమ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్ 
ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...
గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*
అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు