ఉద్యోగ విరమణ పొందిన  పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్.

పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.

ఉద్యోగ విరమణ పొందిన  పోలీస్ అధికారులను సన్మానించిన పోలీస్ కమిషనర్.

ఖమ్మం:లోకల్ గైడ్:
ఉద్యోగ విరమణ పొందిన  పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలందించారారని  కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.   పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.  

ఉద్యోగ విరమణ పొందిన వారు:
డి. రామయ్య (ఎస్సై)
ఏ.గోపి (ఏఆర్ఎస్సై)
ఏస్కె. యాకుబ్ పాషా (ఏఆర్ఎస్సై)
పి.శాంతారెడ్డి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్)
జి. వెంకన్న (హోంగార్డ్ పి ల్ సి )
ఈ కార్యక్రమంలో* అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం,అడిషనల్  డీసీపీ  లా అండ్ ఆర్డర్  ప్రసాద్ రావు, ఏసీపీ సుశీల్ సింగ్ , ఆర్ ఐ శ్రీశైలం,నాగుల్ మీరా పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వేంకటేశ్వర్లు,అర్సిర్శి లక్ష్మణరావు, ఖమ్మం జిల్లా హోం గార్డ్  సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, సభ్యులు సీహెచ్ నాగరాజు తదితలు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు