యుద్ధ ప్రాతిపదిక పైన రైతులకు యూరియా అందించాలి.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది .
By Ram Reddy
On
మిర్యాలగూడ జనవరి21
(లోకల్ గైడ్, తెలంగాణ)
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రైసింగ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో యాసంగి సీజన్లో వరి నాటు వేసి దాదాపు 20 నుండి 25 రోజులు కావస్తుంది రైతులకు సకాలంలో యూరి అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని చెప్పటంతో స్మార్ట్ ఫోన్లో ఉన్న రైతులు యూరియా బుకింగ్ చేసుకుంటే రైతులు ఉన్న గ్రామం కాకుండా చుట్టుపక్కల 15 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు మీ యూరియా వచ్చిందని మీరు అక్కడికి పోయి తీసుకోమని చెప్తున్నారు వచ్చిన రైతులు యూరియా తెచ్చుకోలేక చాలా తంటాలు పడుతున్నారు కొంతమంది రైతుల దగ్గర స్మార్ట్ఫోన్ లేక బుకింగ్ చేసుకోలేదు నేటికీ వారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరా పునరా ఆలోచన చేసి ఆన్లైన్ సిస్టమును రద్దుచేసి నేరుగా రైతు అన్ని గ్రామాలకు వ్యవసాయ అధికారుల ద్వారా గాని లేక ప్రభుత్వ అధికారుల ద్వారా గాని అన్ని గ్రామాలకు యూరియా సప్లై అయ్యే విధంగా చూడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది . ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ లో యాసంగికి సరిపడా యూరియా ఉన్నదని ఊగ దంపుడు మాటలు చెబుతున్నారు తప్ప యూరియా అందించలేకపోతున్నారని వారన్నారు అందుకని నేరుగా రైతులకు యూరియా అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని రైతు సంఘం భావిస్తున్నది ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక కైనా నేరుగా రైతులకు యూరియా అందించే విధంగా చూడాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కి మెమోరాండం ద్వారా తెలియజేస్తున్నాను మిర్యాలగూడ వేములపల్లి సిపిఐ మండల కార్యదర్శి అంజనపల్లి రామలింగం,జిల్లా యాదగిరి,కొండేటి సైదులు, ప్రవీణ్, నాగేషు, మున్ని, నాగు నాయక్ తదితరు లు ఇచ్చినారు.
Tags:
About The Author
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
