మున్సిపల్ ఎన్నికల గురించి సమీక్ష సమావేశం.

సమావేశంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులు

మున్సిపల్ ఎన్నికల గురించి సమీక్ష సమావేశం.


తొర్రూర్ (లోకల్ గైడ్)
రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వ చీఫ్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ లతో కలిసి మాట్లాడుతూ గత ప్రభుత్వ పదేళ్ల అహంకారాన్ని పది రోజుల్లో దించిన ఘనత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డి, ప్రజలదన్నారు.
ప్రజా ప్రభుత్వానికి మరింత బలం పెరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలో కూడా ఉంటాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలన్నారు. సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగామని, మీరు కూడా ఈ స్థాయి నుంచి ఏ స్థాయి కైనా వెళ్ళవచ్చు అన్నారు.
మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ హయాంలో అప్పుల రాష్ట్రంగా మార్చారు. నెలనెలకు అప్పులు కట్టడమే సరిపోతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థను గాడిన
 పెడుతున్నారని,గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకకపోయేదని, ఇప్పుడు సామాన్యులకు కూడా సీఎం అప్పాయింట్మెంట్ దొరుకుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి కృషి చేస్తామని అన్నారు.మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని,
మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలన్నారు.
అనంతరం : పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరిని ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి వినతిపత్రం అందించారు. దీంతో మంత్రి స్పందించి మినీ స్టేడియం మంజూరు చేస్తానని సానుకూలంగా స్పందించారు. మంత్రి స్పందించినందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య