చర్ల బీఆర్ఎస్ పార్టీలో చేరిన నర్సవేణి.
పార్టీలో చేరిన నర్సవేణికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
చర్ల : లోకల్ గైడ్ :
చర్ల రఘు థియేటర్ రోడ్డులోని పామేడ్ రామారావు సతీమణి బేతంచర్ల నర్సవేణి బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గం సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నర్స వేణి మాట్లాడుతూ కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా చెప్పిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరు అమలు చేయలేదని మళ్లీ కేసీఆర్ తో నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు బాగుపడతారని ఆమె అన్నారు. అనంతరం ఉప్పరిగూడెం సర్పంచ్ గా గెలుపొందిన సోయం నాగలక్ష్మిని శాలువాతో సన్మానిoచారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
