పురుగు మందుల భద్రత పై రైతులకు అవగాహన సదస్సు
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీశైలం హాజరయ్యారు.
భద్రాద్రి జిల్లా, బూర్గంపహాడ్ లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం టేకులచెరువు గ్రామం లో ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పురుగు మందులపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీశైలం హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి కే రాజేష్ మాట్లాడుతూ....రైతులకు పురుగు మందుల ఉపయోగం, వాటి మోతాదులు, ప్రయోజనాలు మరియు భద్రతా చర్యలు ఎలా పాటించాలో తెలిపారు. పురుగు మందులు ఎలా వాడాలో, మందు స్ప్రేయింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. వాటి సముచిత మోతాదు, సరిగా స్ప్రే చేయడం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు అందించారు మందు తీగల సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (గ్లౌజ్, మాస్క్, రబ్బరు బూట్లు) ధరించడం, స్ప్రే సమయంలో ఉపయోగించిన నీటిని, ఖాళీ బాటిలీలను సురక్షితంగా తీసుకురావడం మొదలైనవి పాటించాలని రైతులకు వివరించారు.. ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ నిర్వహించిన అవగాహన కార్యక్రమం రైతులకు పురుగు మందుల సురక్షిత, సముచిత ఉపయోగంపై స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి, ఇది పంట ఉత్పత్తి పెరుగుదలతో పాటు రైతుల ఆరోగ్య రక్షణను కూడా బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కంపెనీ ప్రతినిధులు ఎల్. కళ్యాణ్, ఎమ్. సురేష్, తదితరులు పాల్గొన్నారు.
