మరణించి జీవిస్తున్న బింగి అశోక్ కుమార్...

నేత్రదానంతో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు....

మరణించి జీవిస్తున్న బింగి అశోక్ కుమార్...

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబుక్యాంపు బస్తికి చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి బింగి అశోక్ కుమార్(63) శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.ఆయన కుటుంబ సభ్యులు ఉదార స్వభావంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి నేత్రదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సదశయా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి సహకారంతో ఎల్ వి ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ ఆయన నేత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతు బింగి అశోక్ కుమార్ సతీమణి బింగి రాజ కుమారి,కుమారులు బింగి శ్రావణ్ కుమార్,సంతోష్ కుమార్,తల్లి బింగి వెంకమ్మ,సోదరుడు బింగి మల్లేష్ లు నేత్ర దానం ద్వారా ఇద్దరి అందులకి చూపునివ్వాలని నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయం అని వారి స్ఫూర్తితో ప్రజలందరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని,అయితే ఏ వ్యక్తి అయినా మరణించిన తరువాత నేత్ర,అవయవ,శరీరాలు కాల్చి వృధా చేయకుండా అవయవాలు దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు.ఒక వ్యక్తి మరణించిన తరువాత 8గంటలలోపు కళ్లలోని కార్నియా పొరని మాత్రమే సేకరిస్తారని,నేత్ర దానం ద్వారా మరో ఇద్దరు అందులకి చూపు ప్రసాదించి వారి ద్వారా మరణించిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారి అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండి శరీర అవయవాలు అవసరం ఉన్న మరో 8మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని,శరీర దానం ద్వారా పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకి అందించి కొన్ని వేల వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగపడి ప్రజల వైద్య చికిత్సలకు ఉపయోగపడే అవకాశం ఉందని సూచించారు.ప్రజలు అపోహలు వీడి నేత్ర,అవయవ,శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.నేత్రదానం అనంతరం కుటుంబ సభ్యులకు ఎల్ వి ప్రసాద్ ఐ బ్యాంక్ నేత్ర దాన సర్టిఫికెట్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నీలి కృష్ణ,సామాజిక కార్యకర్త గజేల్లి మోహన్,జనహిత సేవా సమితి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల రమాదేవి,ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి,కోశాధికారి కొడిపెళ్లి గిరిప్రసాద్,కార్యవర్గ సభ్యులు డోలి సుకుమార్ కుటుంబ సభ్యులు బంధు మిత్రులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం