లోకల్ గైడ్ కేశంపేట
కేశంపేట మండలం పరిధిలోనీ సంతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామ అభివృద్ధికోసం వినతి పత్రం అందచేసిన కర్రెడ్ల నరేందర్ రెడ్డి మాట్లాడుతు గ్రామంలో అతి పెద్ద సమస్య డ్రైనేజీ ఉందని దానికి వెంటనే నిధులు విడుదల చేయాలని అదేవిధంగా శ్రీ పాలకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి విద్యుత్ సరఫరాను అందిస్తామని ఇప్పటికి అందించలేదని దయచేసి వెంటనే విద్యుత్ అందించాలని కోరారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుందని పేర్కొన్నారు.