ఈ నెల 17 న జిల్లా వ్యాప్తంగా నిరసన  విజయవంతం చేద్దాం

టి జి జె ఏ సి పిలుపు

ఈ నెల 17 న జిల్లా వ్యాప్తంగా నిరసన  విజయవంతం చేద్దాం

నారాయణపేట ఏప్రిల్ 13:
ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం  ఈ నెల 17న నిర్వహించే నల్ల బ్యాంకులతో నిర్వహించే  నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 
టి జి జె ఎ సి  నారాయణ పేట జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.సోమవారం  టి జి జేఏసీ నారాయణపేట జిల్లా  విస్తృతస్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో జేఏసీ చైర్మన్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగ స్వామి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ 17వ తేదీన రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అన్ని మండల కేంద్రాలలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పిఆర్సి, డిఏలు, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు,రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు అనేకమైన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసము ఉద్యమ బాట పట్టవలసి వచ్చిందని వారన్నారు. ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమును రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లనుపరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద మొత్తం లో ఉద్యమం నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో జేఏసీ సెక్రెటరీ జనరల్ మొ గులప్ప,అడిషనల్ సెక్రటరీ జనరల్ వై జనార్దన్ రెడ్డి, జేఏసీ కోచెర్మన్లు రెడ్డెప్ప, బాలాజీ,రామ్ రెడ్డి,లక్ష్మీకాంత్,రామ్ గోపాల్,సూర్యచంద్ర,అశోక్ గౌడ్ భాగస్వామ్య సంఘాల బాధ్యులు గజలప్ప, నారాయణ,అశోకు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.సమావేశంలో మాట్లాడుతున్న నర్సింహ రెడ్డి 
____________________
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.