విద్యుత్ సబ్స్టేషన్ ముందు టీవీ ఏఈ ఆధ్వర్యంలో ధర్నా.
మద్దతు తెలిపిన సిఐటియు విద్యుత్ సంస్థల కార్మిక సంఘాలు.
మిర్యాలగూడ ఏప్రిల్
( లోకల్ గైడ్ తెలంగాణ )
గత రెండు దశాబ్దాల నుండి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతుందని దాన్ని నిరసిస్తూ స్థానిక సబ్స్టేషన్ ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బుధవారం నాడు జరిగిన ఈ ధర్నాకు సీఐటీయూ విద్యుత్ కార్మిక సంస్థలైన 2117 యూనియన్ టి ఆర్ యు ఎస్ కే జూనియర్ 327 యూనియన్ తన మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మల్లేష్ గౌతమ్ రెడ్డి లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 23000 పైగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఇప్పటివరకు కూడా ఇట్టి కార్మికులను రెగ్యులర్ చేయలేదని వారు తెలిపారు 23,000 మందిలో ఇప్పటికీ కొంతమంది చనిపోగా మరికొందరు రిటైర్డ్ అయ్యారని మిగిలిన 18,000 మందికి ఇప్పటికీ రెగ్యులర్ కాకపోవడం విచారకరమన్నారు. వీరిలో అత్యధికులు ఐటిఐ చేసిన వారు అధిక విద్య అర్హతలు కలిగిన వారు ఉన్నారని అలాంటి వారిని రెగ్యులర్ చేయకపోవడం విచా రకరమన్నారు. విద్యా అర్హతలు ఉన్నవారికి కన్వర్షన్ చేయలేదని, జీవో ఎంఎస్ నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని బిల్ కలెక్టర్లకు ఇస్తున్న పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థలోని వివిధ యూనియన్ల నాయకులు ఎన్ రాము ఆదిరెడ్డి సైదులు రాజేశ్వర్ ఫస్ట్ యుద్దీన్ సిఐటి యు నాయకులు రవి నాయక్ సిపిఎం నాయకులు మంగారెడ్డి సైదులు పరశురాములు పాల్గొన్నారు.
