మేడిపల్లి భూముల వివాదం: ఎమ్మార్వో, ఆర్‌ఐల సస్పెన్షన్

డిమాండ్ – కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

మేడిపల్లి భూముల వివాదం: ఎమ్మార్వో, ఆర్‌ఐల సస్పెన్షన్

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
 
ఏప్రిల్ 13:చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో భూవివాదం తీవ్రతరమైంది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను పట్టాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ టిడిపిఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.గ్రామస్తుల వివరాల ప్రకారం, సర్వే నెంబర్ 96కు చెందిన భూమి గత 50 సంవత్సరాలుగా నిషేధిత జాబితాలో ఉండగా, ప్రస్తుతం భూభారతి రికార్డుల్లో కూడా అదే విధంగా నమోదు అయి ఉందని తెలిపారు. అయినప్పటికీ తప్పుడు నివేదికలు సృష్టించి పట్టాగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.ఈ విషయంపై పలుమార్లు చిన్నకోడూరు ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకుని పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ భూములను పట్టాలుగా ఎలా మార్చుతారని ప్రశ్నించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సర్వే నెంబర్ 96ను నిషేధిత జాబితాలో కొనసాగించాలని ఆదేశించినట్లు సమాచారం.ఈ ఘటనపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!