అంగన్వాడీ సేవలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష.
పాలకుర్తి లోకల్ గైడ్ :
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ సీడీపీవోలు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులకు అందజేస్తున్న పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, శుభ్రత, తాగునీటి సదుపాయాలు, పిల్లల అభివృద్ధి కార్యక్రమాలపై విపులంగా చర్చించడం జరిగింది..
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా ఉండాలి. ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీపడకూడదు. పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం అనేది అస్సలు ఉండకూడదు” అని సూచించారు.
అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సమయానికి ఆహారం అందజేయాలని, పిల్లల బరువు, ఎత్తు వంటి ఆరోగ్య రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, తల్లిదండ్రులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.
సమావేశంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సీడీపీవోలు, సూపర్వైజర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
