వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. 

వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. 


         రంగారెడ్డి జిల్లా బ్యూరో, (లోకల్ గైడ్ ):

రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
         ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కాంటా వేసి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాల పరిశీలనలో పారదర్శకత పాటించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వివరాలు నమోదు చేసే రిజిస్టర్ పరిశీలించారు. వరి, మొక్కజొన్న నిల్వలో ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని భద్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్ని బ్యాగులను, టార్ఫలిన్ లను అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 
         ఈ పర్యటనలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్, మార్క్ ఫెడ్ అధికారి, మండల వ్యవసాయ అధికారి,  సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News