మిర్యాలగూడ నూతన మునిసిపల్ చైర్ పర్సన్ కు పద్మశాలిల సన్మానం.

పద్మశాలి ఆడపడుచు చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

మిర్యాలగూడ నూతన మునిసిపల్ చైర్ పర్సన్ కు పద్మశాలిల సన్మానం.

 మిర్యాలగూడ ఫిబ్రవరి 18 
 (లోకల్ గైడ్ తెలంగాణ)

మిర్యాలగూడ నూతన మునిసిపల్ చైర్ పర్సన్ పట్టణ మొదటి పౌరురాలు శ్రీమతి సుధ బాలకృష్ణ కి పట్టణ పద్మశాలి సంఘం తరుపున ఘనంగా సన్మానం క నిర్వహించడం జరిగింది. పద్మశాలి సంఘం స్టీరింగ్ కమిటీ,పట్టణ కమిటీ గజమాలతో చైర్ పర్సన్ దంపతులను సత్కరిచారు. 14 వ వార్డు కౌన్సిలర్  వడ్డేపల్లి శ్రీనివాస్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. పట్టణ చరిత్రలో పద్మశాలి ఆడపడుచు చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి కులస్తురాలుకు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి పద్మశాలీలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధ బాలకృష్ణ  మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని, స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్ది,పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చుతానని తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జెల్లా రాంబాబు, బావండ్ల పాండు, డాక్టర్ గుండు అంజయ్య, డాక్టర్ మిర్యాల కృష్ణయ్య,డాక్టర్ మనోహర్, అక్షిత క్యామా వెంకటేశం, యర్రమాద దుర్గమ్మ, రాపోలు వెంకటేశ్వర్లు, బొల్లా లక్ష్మీనారాయణ, రావిరాల నాగేందర్, కోడి జనార్దన్,మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవిశ్యామ్, జెల్లా శ్రీనివాస్, జిల్లా ప్రభాకర్, మురళి, శ్రీను పట్టణ కమిటీ సభ్యులు స్టీరింగ్  అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం