ఉత్తమ పార్లమెంటేరియన్ కామ్రేడ్ ఏచూరి.
పట్టణంలో పలుచోట్ల జయంతి ఉత్సవాలు
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా లోకల్ గైడ్ :
ఉత్తమ పార్లమెంటేరియన్ గా అంతర్జాతీయ కమ్యూనిస్టులను ఏకం చేసిన మహా నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున ,జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య లు అన్నారు. మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో, 11వ వార్డు కతాలగూడెం లో, 20వ వార్డు పెద్ద బండలో ,43 వ వార్డు డాక్టర్స్ కాలనీలో కామ్రేడ్ సీతారామ్ ఏచూరి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారని కొనియాడారు సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థించే వారిని అన్నారు ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారిఅని అన్నారు.అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి నిందించే వారిని అన్నారు.పశ్చియాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీసిందని ఆరోపిస్తారు. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడుపోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే నిదర్శనమంటారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవటానికే, పెత్తనం కోసం అర్రులు చాస్తోందని విమర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా, వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమంటారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా అనేక ఐక్య ఉద్యమాలను నిర్మించిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని కొనియాడారు వారి ఆశయ సాధన కోసం కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండ అనురాధ మండల కార్యదర్శి నలపరాజు సైదులు ,పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి అవుట రవీందర్ కోట్ల అశోక్ రెడ్డి దండంపల్లి సరోజ అద్దంకి నరసింహ పాక లింగయ్య, గాదె నరసింహ జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్ ఊట్కూరి మధుసూదన్ రెడ్డి కొండ వెంకన్న గంజి నాగరాజు, కిరణ్, ఇక్బాల్ సాజిద్,పనస చంద్రయ్య, నోముల యాదయ్య దేవరంపల్లి వెంకట్రెడ్డి, గడగోజు శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author

Latest News
16 Aug 2025 09:49:06
https://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vGhttps://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vG