సర్పంచ్ దబ్బకట్ల సుమన్ ఆధ్వర్యంలో పూసూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

ప్రారంభమై గ్రామాల అభివృద్ధికి వేగం పెరిగింది.

సర్పంచ్ దబ్బకట్ల సుమన్ ఆధ్వర్యంలో పూసూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

 

ములుగు జిల్లా, వాజేడు : లోకల్ గైడ్ :

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు మరియు ఏడుజర్లపల్లి గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమై గ్రామాల అభివృద్ధికి వేగం పెరిగింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు మంజూరు కావడంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పూసూరు గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం రూ 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, సర్పంచ్ దబ్బకట్ల సుమన్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కాంగ్రేస్ ప్రభుత్వంలో నూతన సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో లేని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని పేర్కొంటూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.
అదే సమయంలో, గోదావరి తీరంలో రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ తోలెం రవీందర్, కాంగ్రేస్ నాయకులు జాడి ఎల్లయ్య, వాసం హరికృష్ణ, జనగం కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఏడుజర్లపల్లి గ్రామ పంచాయతీలోని ముత్తారం కాలనీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులను బీజేపీ సర్పంచ్ అట్ట మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు కందుల రామ్ కిషోర్ మాట్లాడుతూ మండలంలో సుమారు 90 రోడ్ల నిర్మాణానికి రూ.3.55 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల సర్పంచులు నాణ్యమైన రోడ్లు నిర్మించి గ్రామాభివృద్ధిని మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్ది జగపతిబాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ సాగి సీతారామరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి