పెండింగ్ లో  ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.

టీపీటీఎఫ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి...వెల్లడి

పెండింగ్ లో  ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి24(లోకల్ గైడ్ 

విద్యా రంగ బడ్జెట్ ను సవరించి 20% వరకు పెంచాలి,హనుమకొండ  కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన,
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ వందలాది మంది ఉపాధ్యాయులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 
ఈ నిరసన ప్రదర్శనకు హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ పాలకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన 8.22 శాతం నుండి 20 శాతం వరకు పెంచి బడ్జెట్ ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటే ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, కంప్యూటర్, గ్రంథాలయ నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకం, పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టడం మొదలగునవి బడ్జెట్ పెంచడం వల్లనే సాధ్యమవుతుందన్నారు. గతపిఆర్సి గడువు 2023 జూలై తో ముగిసి 33 నెలలు కావస్తున్న నేటి బడ్జెట్లో కొత్త పిఆర్సి ప్రస్తావన లేకపోవడం, బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలకు ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్చి 2024 అనంతరం రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నందున పదుల సంఖ్యలో ఉద్యోగులు మరణించారని, వెంటనే రిటైర్మెంట్ ప్రయోజనాలను ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు దాచిపెట్టుకున్న జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ తదితర పెండింగ్ బిల్లులను ఈ-కుబేర్ లో సంవత్సరాల తరబడి మూలుగుతున్నాయని, పెండింగ్ ఆర్థిక బిల్లుల కు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేయాలని కోరారు.
టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిని శ్రీమాంజనేయులు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు శ్రమదోపిడికి గురవుతున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైం స్కేళ్లను వర్తింపజేయాలని, సమ్మె కాలపు జీతాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, గిరిజన, ఆశ్రమ రెసిడెన్షియల్ టీచర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ మాట్లాడుతూ జీవిత భద్రత లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, ప్రభుత్వ కారణాలలో ఆలస్యమైన 2003 డిఎస్సీ టీచర్లకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే పాత పించెను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 
ఈ నిరసన ప్రదర్శనలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి లక్ష్మయ్య, కుమారస్వామి, సిహెచ్ రాజేంద్రం, వీరభద్రం, కార్యదర్శులు జి రమేష్, అన్నారెడ్డి, అంకం శ్రీనివాస్, చక్రునాయక్ ,సత్తార్ , సీనియర్ నాయకులు జి నటరాజ్, పి జయప్రకాష్, అంకతి సదానందం, సుదర్శన్, ఎస్.కుమారస్వామి , రాజేందర్ , బి.సారయ్య, భాస్కర్, బిక్షపతి, శ్రీరామ్, కొమురయ్య, సారయ్య, చంద్రమౌళి, రాజు, మల్లేశం, రవీందర్,చందర్ నాయక్,సదానందం, వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన