వికలాంగుల ఆపద్బాంధవుడు రేవంతన్న

ముత్తినేని వీరయ్య వర్మ

వికలాంగుల ఆపద్బాంధవుడు రేవంతన్న

 నల్గొండ లోకల్ గైడ్
  మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ నల్లగొండ ఆధ్వర్యంలో  జిల్లాలో దివ్యాంగులకు ఉచిత  సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ హాజరై, మాట్లాడుతూ నేడు దివ్యాంగుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని ,అందులో భాగంగా దివ్యాంగులకు పెద్దన్న  పాత్ర పోషిస్తూ దివ్యాంగుల జీవితాలు వెలుగు నింపుతున్న మహనీయుడు మన ముఖ్యమంత్రి రేవంతన్న  అని అన్నారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను, సకలాంగులు వివాహం చేసుకుంటే కేవలం లక్ష రూపాయలు ఇచ్చేవారుఅని ,ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం దివ్యాంగులు దివ్యాంగులను వివాహం చేసుకున్నా కానీ 2 లక్షల రూపాయల ప్రోత్సాహం అనేది ఇవ్వడం గొప్ప నిర్ణయమని ఈ ప్రజా ప్రభుత్వంలో దివ్యాంగులకు ఉద్యోగ  అవకాశాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లను, ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్లు  ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ  ప్రభుత్వం జీవోలను కూడా తీసుకురావడం జరిగిందని ,దివ్యాంగుల పెన్షన్ పెంపు కోసం కూడా తీవ్రమైనటువంటి కృషి  జరుగుతుందని ఈ ప్రజా ప్రభుత్వంలో దివ్యంగా సోదరులకు భవిష్యత్తులో మరిన్ని ఉచిత ఉపకరణాలను ఇవ్వడానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు .నల్గొండ జిల్లాలో దివ్యాంగ సోదరులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 112 రెట్రో ఫిట్టర్ మోటర్ వెహికల్స్ ని మంజూరు చేయడం జరిగింది . గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ఒక సంవత్సరంలోనే దివ్యాంగులకు పెద్ద ఎత్తున ఈ కార్ట్ బండ్లు, లాప్టాప్స్, 5జి మొబైల్స్ వీల్ చైర్స్, వివిధ రాకలైన ఉచిత పరికరాలు మంజూరు చేయడం జరిగిందని దివ్యాంగుల జీవనోపాదులను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అవకాశాలు మెరుగుపరచడం కోసం కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కె.వి. కృష్ణవేణి  , వార్డెన్ వెంకటరెడ్డి  సీనియర్ అసిస్టెంట్ బాలయ్య  ఆఫీస్ సిబ్బంది నవీన్, సునీల్, కొత్త వెంకన్న దివ్యాంగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.