ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
ప్రజల భద్రత కొరకే పోలీస్ శాఖ నిరంతరం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని జైపూర్ సిఐ నవీన్ అన్నారు.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్,సైబర్ నేరాల అవగాహనతో పాటు వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ ఆస్తి సంబంధిత నేరాలు,రోడ్డు ప్రమాదాలు,సైబర్ మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.ముఖ్యంగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ట్రాఫిక్ నియమాలు పాటించడం,ఆన్‌లైన్ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలు లేని 66ద్విచక్ర వాహనాలు,3ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.వాహనదారులు తప్పనిసరిగా దృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని,లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని,పోలీసులకు సహకరించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
