అంగన్వాడీ టీచర్ల మెరుగైన సేవల కోసం స్మార్ట్ ఫోన్లు పంపిణీ..

దివ్యాంగులకు ల్యాప్ టాప్స్, టాబ్స్ అందించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్నాం.. ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి.. అన్ని వసతులు, నాణ్యమైన సేవలకు కేరాఫ్ అడ్రస్ గా పెద్దపల్లి జిల్లా వైద్యశాల..

అంగన్వాడీ టీచర్ల మెరుగైన సేవల కోసం స్మార్ట్ ఫోన్లు పంపిణీ..

పెద్దపల్లి జిల్లా ప్రధాన వైద్యశాల లో సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు  కోరారు. 

 
 
పెద్దపల్లి :ఏప్రిల్;13.(లోకల్ గైడ్)
 
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం రోజున ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ పోషణ పక్షం 2026 కార్యక్రమంలో పాల్గొని పలువురు మహిళలకు ప్రభుత్వం తరుపున సీమంతం చేసి వారిని ఆశీర్వదించి మరియు 304 మంది అంగన్వాడీ టీచర్లకు రూ. 42.28 లక్షల విలువ గల స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి అనంతరం 13 మంది దివ్యాంగులకు రూ. 8.60 లక్షల విలువ గల ల్యాప్ టాప్స్, టాబ్స్ పంపిణీ చేసి నియోజవర్గంలోని 513 మంది లబ్ధిదారులకు రూ. 1.62 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్) చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు ...
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..
 
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఊరట అని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు, పూర్తిస్థాయిలో డాక్టర్లు, మందులు, కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించి రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల గుర్తింపు తెచ్చుకున్నదని చెప్పారు. ప్రజలు మాత శిశు సంక్షేమం, ఇతరత్రా వైద్య సేవలకు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఒకవేళ ఈ ఆసుపత్రిలో సేవల కంటే మెరుగైన వైద్య సేవలు అవసరమైన పక్షంలో హైదరాబాద్ లోని నిమ్స్ లో వైద్య సేవలు అందించే బాధ్యత తనదన్నారు. దివ్యాంగులకు ల్యాప్ టాప్స్ మరియు టాబ్స్ పంపిణీ చేసి వారి జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. అంగన్వాడి టీచర్లు మెరుగైన సేవలను అందించడానికి తోడ్పాటుగా ప్రభుత్వం వారికి స్మార్ట్ ఫోన్లు అందిస్తూ పేద పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక చొరవ తీసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని అదేవిధంగా వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకొనే పిల్లల సంఖ్యను పెంచి వారికి మరింత మెరుగైన విద్య అందించాలని కోరారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ ప్రోగ్రాములను నిర్వహిస్తూ మత శిశు సంక్షేమానికి తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. టీచర్లకు కొత్తగా ప్రభుత్వం వారికి స్మార్ట్ ఫోన్లు అందించడం జరుగుతుందని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అంగన్వాడీ టీచర్లను కోరారు. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తాను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నుండి 17 కోట్ల పైచిలుకు సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు అందజేశామని గుర్తు చేశారు. అలాగే నిమ్స్ ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు సహాయంగా 9 కోట్ల విలువైన LOC చెక్కులను అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆశీస్సులతో నిరంతర సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు.
 
ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ జిల్లా అధికారి వేణు గోపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్లు ముస్కాన్ నాజ్ నయ్యర్, అంతటి పుష్పలత, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News

_గాంధీ భవన్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ _గాంధీ భవన్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
        కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)   గాంధీ భవన్ లో  రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన  ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర  కార్యవర్గ
రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు.
అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
అంగన్వాడీ టీచర్ల మెరుగైన సేవల కోసం స్మార్ట్ ఫోన్లు పంపిణీ..
ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో
సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇప్పించండి
మసిగుండ్లపల్లిలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం