మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్

మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్

సిద్దిపేట జిల్లా ప్రతినిధి నరేష్: (లోకల్ గైడ్ తెలంగాణ) 

మార్చి 12: తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28న సిద్దిపేట కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ శ్రీమతి కే. సాయి రామ దేవి తెలిపారు.
ఈ లోక్ అదాలత్‌లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ (NI Act) కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహారం (MAzCT) కేసులనుd రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఒకేసారి రాజీ చేసుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా సహకరించాలని ఆమె కోరారు.

Tags:

About The Author

Latest News