మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..

పోతినేని సుదర్శన్ రావు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..

మధిర మార్చి 12 *(లోకల్ గైడ్):

సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడెపుడి భవన్ నందు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మొక్కజొన్న పంట ఇప్పటికే చేతికి వచ్చింది. ఆరు కాలమ్స్ శ్రమించిన మొక్కజొన్న రైతు తక్కువ ధరలకే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోలు కోసం కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.రైతులకు అందించాల్సిన పంట సహాయాన్ని కాలం గడిచిపోయినప్పటికీ అందించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రజా సంక్షేమం రైతు సంక్షేమం గురించి ఆలోచించకుండా రోజువారి రాజకీయాల్లో మంత్రులు ఎవరికి వారు బిజీగా ఉన్నారని అన్నారు.ప్రభుత్వం రైతాంగం పై పేద ప్రజలపై యుద్ధం ప్రకటించినట్లు కనపడుతోందని అన్నారు.యూరియా అందించడంలోనూ రుణమాఫీ చేయడంలోనూ పంట సహాయము అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు,పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు,పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, దివెల వీరయ్య, మంద సైదులు,డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య,కిలారి సురేష్,పట్టణ కార్యదర్శి పడకంటి మురళి,ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ ఓట్ల శంకర్రావు బంధం శ్రీనివాసరావు గౌర్రాజు ధనలక్ష్మి,గుండ్లపల్లి రమణమ్మ, హనుమంతరావు,వెంకట్రావు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు...

Tags:

About The Author

Latest News