వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు 

లోకల్ గైడ్ 

  1. నిజం నిగ్గు తేలాలంటే 
    చెయ్యాలిగా సమీక్ష
    స్వచ్ఛతకై బంగారాన్నైనా 
    చేస్తారుగా పరీక్ష.

2.ప్రభుత్వానికి పాఠం 
నేర్పేది ప్రజాభిప్రాయం 
ప్రభుత్వ మార్పుకే 
తీర్పు ఇచ్చేది ప్రజాగ్రహం.

3.చిరు కోపం 
ఒక మంచి ఆభరణం 
పెను కోపం 
కొంపముంచు కారణం.

4.పలకరిస్తే 
మనసు పులకరించు 
ఒలకబోస్తే 
ఒళ్ళు జలదరించు.

5.ఎలుకలు పడ్డాయని 
కూలగొడతామా ఇండ్లు 
నాలుకను కొరికాయని 
రాలగొడతామా పండ్లు.

6.చెప్పిన మాట 
వినకపోవడం పిల్లతనం
 చెప్పినా మాట 
వినకపోవడం డొల్లతనం .

7.తరగాలి 
బరువు 
పెరగాలి 
ఆయువు .

8.జీవితంలో 
నటించడమే 
నటనలో
జీవించడమే.

9.నీలోనే కలవు సకల శక్తులు 
విజృంభిస్తే మోగించేవు విజయ ఢంకా నాభిలోని పరిమళం గ్రహించక ఎక్కడెక్కడో వెతుకుతుంది కస్తూరి జింక.

 వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Latest News