సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం.

జ్యూరిక్ సాంకేతికతపై సీపీ డాక్టర్ ఎం.రమేష్ సమీక్ష

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం.

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పోలీసులు సరికొత్త వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. యూరప్ దేశాలలో విజయవంతంగా అమలవు తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని సైబరాబాద్‌లో ప్రవేశపెట్టే అవకాశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలిలోని పీఎస్‌ఐఓసీ, ఎస్‌సీఎస్‌సీ సమావేశ మందిరంలో సీపీ డాక్టర్ ఎం.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాన్స్ స్కాలిటీ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందుగానే రద్దీ అంచనా ఏఐ సాంకేతికత ద్వారా నగరంలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించ వచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ సిగ్నల్‌లను స్వయంచాలకంగా నియంత్రించి వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నిర్వహించగలదని వివరించారు. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు."రోడ్డు భద్రతే లక్ష్యం" నగరంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్ ట్రాఫిక్ టెక్నాలజీల వినియోగం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటంతో పాటు పోలీసు సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు టి.అన్నపూర్ణ, ఐ. రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవేద్, ఆస్కి (ఏఎస్ సీఐ) ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ