నారాయణపేట మార్చి 12:
ప్రజా ప్రభుత్వంలో ఆర్థి కంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా పేదోళ్ల కు సంబంధిం చిన చెక్కులను ఆపకుండా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పాడి మత్స్య పరిశ్రమ క్రీడలు యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు, గురువారం మాగ నూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో 145 మంది కి మంజూరైన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబార క్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు,ఈ సందర్భం గా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరుమీద వస్తున్నదని అన్నారు, ఇప్పటివరకు 532 చెక్కులు గాను ఐదు కోట్ల 32 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందజేశామన్నారు, మహిళల కు అందించిన చెక్కులను పెళ్లిళ్లకు కోసం తెచ్చిన అప్పులను ముట్టించి మాట నిలబెట్టుకోవాలని అన్నారు, అప్పు లేని వారు పిల్ల లేక తల్లి పేరు మీద డిపాజిట్ చేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్ర మంలో తహసిల్దార్ సురేష్ కుమార్ ఆర్ ఐ శ్రీశైలం ,బాల రాజ్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ , సర్పంచులు దండు జనార్ధ నమ్మ, ముద్దు రాములు , నర్సింలు, నాయకులు శివరాం రెడ్డి వాకిటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:13.సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీహరి
_____________________