జిల్లాలో పెట్రోల్,డీజిల్ కొరత లేదు....
వదంతులను నమ్మవద్దు....
By Ram Reddy
On
జిల్లా ఎస్పీ నితికా పంత్...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
జిల్లాలో పెట్రోల్,డీజిల్ కొరత లేదని జిల్లా ఎస్పి నితికా పంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతు వాహనాల్లో ఫుల్ ట్యాంక్ లు నింపేందుకు ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లడం వల్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని,సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.ఎటువంటి కొరత పరిస్థితి లేదని,ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించి ఇబ్బందులు సూచించారు.అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని,నిర్ధారించని సమాచారాన్ని ఇతరులకు పంపించడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని ఎస్పి తెలిపారు.సాధారణ అవసరాల మేరకే ఇంధనం వినియోగించుకోవాలని,ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని జిల్లా ఎస్పి కోరారు.జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని,వదంతులు వ్యాప్తి చేసినా,ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags:
