మహిళా సమితి ఆధ్వర్యంలో సింధుకు ల్యాప్టాప్ అందజేసిన ఐటిడిఏ పీవో బీ రాహుల్ 

సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బీ రాహుల్ తెలిపారు.

మహిళా సమితి ఆధ్వర్యంలో సింధుకు ల్యాప్టాప్ అందజేసిన ఐటిడిఏ పీవో బీ రాహుల్ 

 

భద్రాచలం : లోకల్ గైడ్ :
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుపై ఉన్న మక్కువతో కష్టపడి ఎంబీబీఎస్ చదువుతున్న ఉయ్కే సింధుకు మహిళా సమితి ఆధ్వర్యంలో ల్యాప్టాప్ అందజేయడం ఎంతో సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బీ రాహుల్ తెలిపారు.
మంగళవారం ఆయన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో మహిళా సమితి సభ్యులు, పీవో బీ రాహుల్ చేతుల మీదుగా సింధు తల్లిదండ్రులు వెంకటలక్ష్మి మరియు బాబులకు ల్యాప్టాప్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సింధు చదువుపై చూపుతున్న ఆసక్తి అభినందనీయమని అన్నారు. ఆమె చదువుపై ఉన్న కుతూహలాన్ని గుర్తించిన మహిళా సమితి సభ్యులు ముందుకు వచ్చి ల్యాప్టాప్ అందించడం ప్రశంసనీయం అన్నారు. ప్రస్తుతం మెడికల్ విద్యలో డిజిటల్ సదుపాయాలు అత్యంత కీలకమని, ఈ ల్యాప్టాప్ ద్వారా సింధుకు ఆన్లైన్ తరగతులు, అధ్యయనం సులభమవుతుందని పేర్కొన్నారు. భద్రాచలం మహిళా సమితి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని, ఇలాంటి కార్యక్రమాలు మరెందరో పేద విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. పేద విద్యార్థులకు విద్యలో సహాయం చేయడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని, సింధు భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహాయం ఆమె జీవితంలో ఒక కీలక మలుపు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, బీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ జి, కార్యదర్శి మాధవి మురళీకృష్ణ, సుభాషిని, చంగల్ రావు తదితరులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News