బాధిత కుటుంబానికి అండగా నిలిచిన  కారేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు

వారికి ఆర్థిక భరోసానిచ్చే కార్యక్రమం శుక్రవారం జరిగింది.

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన  కారేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు

​ఖమ్మం జిల్లా,కారేపల్లి :లోకల్ గైడ్, ఫిబ్రవరి 20 : మానవత్వానికి నిలువుటద్దంగా, కష్టాల్లో ఉన్న ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక నాయకులు ముందుకు వచ్చారు. సింగరేణి మండల కేంద్రంలోని విశ్వనాధపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల లింగం బంజరా గ్రామానికి చెందిన మెట్టల రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద సమయంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ఆర్థిక భరోసానిచ్చే కార్యక్రమం శుక్రవారం జరిగింది.

​ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తక్షణ సహాయం

​వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించారు. బొక్కలతండా ఉమ్మడి విశ్వనాధపల్లి మాజీ ఎంపీటీసీ అజ్మీరా నారాయణ స్వయంగా తన చేతుల మీదుగా రూ. 5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
​అదేవిధంగా, విశ్వనాధపల్లి సర్పంచ్ ఇస్లావత్ రాజు నాయక్ కూడా మానవత్వంతో స్పందించి, మృతుడి కుటుంబానికి రూ. 4,000/- నగదును అందించారు. మొత్తం 9 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుమారునికి అందజేసి, వారికి ధైర్యం చెప్పారు.

​ఈ సేవా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
​సురవరపు విష్ణువర్ధన్ రెడ్డి,
​మాలోత్ బావుసింగ్, వాంకుడోత్ గన్య, బానోత్ హతిరం
​జర్నలిస్ట్ హాట్కార్ రాంబాబు నాయక్,
​కమర్ మల్లయ్య, ఎస్కే సొందు, కాంచన వెంకన్న, గోవర్ధన్
​తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం