విద్యార్థులు చదువు తో పాటు క్రీడలలో రాణించాలి....
క్రీడాకారులకు సి ఎం కప్ పోటీల ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు....
By Ram Reddy
On
రాష్ట్రస్థాయి సీఎం కప్ కోకో పోటీలను ప్రారంభించిన నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్
నల్లగొండ ఉమ్మడి జిల్లా .ఫిబ్రవరి 20.(లోకల్ గైడ్).
రాష్ట్ర స్థాయి కోకో పోటీలను
ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని (టార్చ్) వెలిగించి మ్యాచ్ ను ప్రారంభించారు అనంతరం శాంతి, సామరస్యానికి చిహ్నంగా పావురాలను ఎగురవేసి, రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలినారు .ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ,
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారని,
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలులో రాణించాలి గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభ గుర్తించి వారిని వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్పు నిర్వహిస్తుందని క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరత్వాన్ని కలిగిస్తాయి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జూనియర్ కోకో పోటీలు నిర్వహించడం 33 జిల్లాల క్రీడాకారులు కష్టపడి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని ,గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులను గుర్తించి తోడ్పడదించడమే సి ఎం కప్ పోటీల ముఖ్య ఉద్దేశం అని అన్నారు.భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి పోటీల ద్వారానే తయారవుతారని
,క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.రాష్ట్రస్థాయిజూనియర్ బాలికలకు బాలురకు కోకో పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వంగా ఉందని
జిల్లాలో క్రీడాకారులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి అక్బర్ అలీ, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,మాజీ జెడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి,కార్పొరేటర్ ఖలీల్,ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు, కోచ్‌లు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
