ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి.

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

నారాయణపేట ఏప్రిల్ 13:
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి  అధికారులకు సూచించారు. కలెక్టర్  సోమవారం   ప్రజావాణి సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను  విన్నవిస్తూ అర్జీలను అదనపు కలెక్టర్ కు  సమర్పించగా, ప్రజల ఫిర్యాదులను సమస్యలను సావధానంగా విన్న అదనపు కలెక్టర్  సమస్యల పరిష్కారానికి  సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  కాగా సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమంలో  మొత్తం 48ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ.రామచందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ 
-----------------------------------------
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.