సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇప్పించండి
భూ పరిహారంలో అక్రమాలను నిరోధించండి - సీపీఐ(ఎం)
By Ram Reddy
On
-
ఖమ్మం జిల్లా, కారేపల్లి :లో కల్ గైడ్, ఏప్రిల్ 13 :
సీతారామ ప్రాజెక్టు ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు ఇప్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి మండల ప్రజావాణిలో సోమవారం తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్ల లో సింగరేణి మండలానికి ఏ ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు అందలేదని, వర్షాదారం, చెరువులు, బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుందన్నారు. అతివష్టి, అనావష్టి పరిస్ధితిలో సింగరేణి మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వినతిలో తెలిపారు. సింగరేణి మండలలోని రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, పాటిమీదిగుంపు మీదిగా సీతారామ ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా తరలించే పనులు జరుగుతున్నాయన్నారు. కాలువల కోసం మండల రైతుల భూములు కోల్పోతున్నా చుక్కనీరు మండలానికి అందే అవకాశం లేదన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చి సింగరేణి మండలానికి నీరు అందించాలని కోరారు. కాలువలకు భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అమలు చేయలేదన్నారు. ఇచ్చిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వీటిని విచారించి న్యాయం చేయాలని మెరుగైన పరిహారం నిర్వాసితులకు అందాలని వినతిలో డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించినవారిలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్, ఆదెర్ల వినయ్, నల్లబెల్లి ప్రతాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
13 Apr 2026 19:42:34
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)
గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
