ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలి... మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

మార్చి చివరి నాటికి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్ పూర్తి చేయాలి. సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ స్థానంలో చేపలు అందిస్తాం.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలి... మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి మంత్రులు

IMG-20260306-WA0108ఖమ్మం, మార్చి - 06:లోకల్ గైడ్ :
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతి నిధులు సంయుక్తంగా కలిసి విజయవంతం చేయాలని మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆది నారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్గం వెంకట్రావు, కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

99 రోజుల కార్యాక్రమంలో చేపట్టే కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరించారు. 

ఈ సందర్భంగా *ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి, పశుసంవర్ధక శాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ* గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలన్నారు. ఆర్థిక స్థితిగతులు సహకరించక పోయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. 

రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. రైతులు పండించే పంటకు బోనస్ అందించి వారిలో విశ్వాసం కల్పించడమే కాకుండా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం రేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని అన్నారు. 

గతంలో మధ్యవర్తులు లబ్దిదారుల పేరిట మీద ఇండ్లు మంజూరు చేయించుకొని డబ్బులు వసూలు చేసుకున్నారని, నేడు అటువంటి లబ్దిదారులకు ఇండ్లు లభించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్లలో పేదల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని అన్నారు.

క్రీడలలో భవిష్యత్తు ఉంటుందనే భావన యువతకు వచ్చేలా అవసరమైన ఇన్ ఫ్రా అభివృద్ధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గచ్చిబౌలిలో హాకీ క్రీడలు ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. క్రీడలలో గాయపడిన క్రీడాకారులకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 

పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి వారం అందించే చికెన్ స్థానంలో చేపలు పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోతులు, కుక్కల సమస్య పరిష్కారం కోసం వాటి సంతానోత్పత్తి నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు ఆధారంగానే ప్రజలలో ప్రభుత్వం పట్ల స్పందన ఉంటుందని మంత్రి తెలిపారు. 99 రోజుల కార్యాచరణ సంవత్సరం మొత్తం కొనసాగించాలని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంయుక్తంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రోగ్రాం చేపట్టిందని అన్నారు.  ఈ కార్యక్రమం ప్రతి గ్రామం, పట్టణానికి చేరువ చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు ఉమ్మడి జిల్లా స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 సెక్టార్ లకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ కు తహసిల్దార్ క్యాడర్ కు తగ్గకుండా ఒక అధికారిని ఇంచార్జి గా నియమించాలని, వీరు ప్రతి వారానికి ఒకసారి వెళ్లి అక్కడ భోజనం నాణ్యత పరిశీలించాలని, అక్కడ ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. 

గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఆసక్తి లేని పక్షంలో అదే గ్రామంలో మరో లబ్ధిదారునికి కేటాయించాలని మంత్రి తెలిపారు. మార్చి చివరి వరకు మొదటి విడత మంజూరు చేసిన ప్రతి ఇల్లు గ్రౌండ్ కావాలని అన్నారు. 

99 రోజుల కార్యాచరణలో భాగంగా హెల్త్ సెక్టార్ పని తీరు మెరుగ్గా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు అవసరమైన స్టాఫ్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి తెలిపారు.  ప్రభుత్వ ప్రాధాన్యత ఆధారంగా ఈ కార్యక్రమం అమలుకు నిధులు కేటాయిస్తుందని అన్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డ్రైయిన్ వల్ల ఇబ్బందులు ఎక్కడ ఉంటున్నాయో పరిశీలించి అక్కడ అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని మంత్రి తెలిపారు. మార్చి 12న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని అన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలు జాయింట్ సర్వే ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు..
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగంలో చాలా అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు‌‌. పంట మార్పిడి, ఎరువుల, రసాయనాల వినియోగం తగ్గించడం, ఆధునిక సాగు పద్ధతులు వంటి అంశాలను ప్రచారం కల్పించాలని అన్నారు. 

*ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ*  మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, ముఖ్యమంత్రి సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఏప్రిల్ 2న  గ్రామ స్థాయి, ఏప్రిల్ 16 న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.  10 ప్రత్యేక అంశాలతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు. 

మార్చి 6 నుంచి మార్చి 15 వరకు పారిశుధ్య నిర్వహణ, ఫైల్స్ క్లీయరెన్స్, ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు వైద్య శాఖ, ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 వరకు ఎరైవ్ ఎలైవ్ పేరిట రోడ్ సేఫ్టీ కార్యక్రమం, ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, హౌసింగ్, ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు చైల్డ్ సేఫ్టీ, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, మే 4 నుంచి మే 10 వరకు వ్యవసాయ శాఖ, మే 11 నుంచి 16 వరకు విద్యాశాఖ, మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడా శాఖ, మే 25 నుంచి 30 వరకు మహిళ సంక్షేమం, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ ప్రాధాన్యతగా కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. 

వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, మున్సిపల్ చైర్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలో ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం పరిధిలో ప్రజలకు అందించే వివిధ సేవలకు సంబంధించి పెండింగ్ ఫైల్స్ 10 రోజులలో క్లియర్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

మార్చి 7 నుండి ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడి స్కూల్స్, బస్టాండ్, ప్రభుత్వ పాఠశాలల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు  చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామం, పట్టణాల్లో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేసుకోవాలని, హోటల్స్, ఫంక్షన్ హాల్స్ వద్ద అధికంగా చెత్త ఏర్పడుతుందని, అక్కడ వాటిని డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభిస్తామని 

వైద్య శాఖ పరిధిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల పై వీధి వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.  అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో న్యూట్రిషన్ పై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే రోజు వైద్య శాఖలో బాగా పనిచేసే వైద్యులు, సిబ్బందికి అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. ఎయిడ్స్ హెచ్.ఐ.వి. నివారణ చర్యలు, మాతృ శిశు సంరక్షణ, హోమియోపతి, ఆయుష్, నకిలీ మందుల నివారణ దిశగా కార్యాచరణ ఉంటుందని అన్నారు. 

ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమం ద్వారా పోలీస్, రవాణా శాఖ అధికారుల ద్వారా రోడ్ సేఫ్టీ పై వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. గత 3 సంవత్సరాల డేటా పరిశీలించి  జిల్లాలో 50 శాతంకు పైగా ప్రమాదాలు జరిగే 30 జంక్షన్ లను  గుర్తించి ప్రమాదాల నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు అక్కడ చేపట్టామని కలెక్టర్ తెలిపారు. 

ఖమ్మం జిల్లాలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు 99 రోజుల కార్యాచరణలో భాగంగా పూర్తి చేసీ గృహప్రవేశం చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.  

చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు ఉంటుందని, ఇందులో అనాథ పిల్లలకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ, సైబర్ నేరాలు, గ్యాంబ్లింగ్, లోన్ యాప్ వేధింపులపై దృష్టి సారిస్తామని, బాల కార్మికుల నిర్మూలన, పిల్లలకు అవసరమైన వైద్య చికిత్స, పిల్లల దత్తత సక్రమంగా జరిగేలా అవగాహన ఉంటుందని అన్నారు.

వ్యవసాయ శాఖ పరిధిలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు ప్రచారం చేయడం, యూరియా యాప్ బుకింగ్ పై అవగాహన కల్పన ఉంటుందన్నారు. విద్యా శాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు శుభ్రంగా ఉండేందుకు పాత సామాగ్రి, పాత కంప్యూటర్ ల తొలగింపు కార్యాచరణ చేపట్టామని అన్నారు. 

పర్యావరణ ప్రాధాన్యత సందర్భంగా పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పచ్చదనం పెంపు చర్యలు, ప్లాస్టిక్ నియంత్రణకు మెగా డ్రైవ్ నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు.  

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ* పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను ప్రతి మండలానికి నియమించినట్లు తెలిపారు.  30 రోజుల కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న ఫైల్స్ 10 రోజులలో క్లియర్ చేయాలన్నారు. 

వ్యవసాయ శాఖలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారం, రైతు నేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో నేరుగా రైతులు సంప్రదించి ఆధునిక సాగు పద్ధతులు నేర్చుకోవడం, యూరియా బుకింగ్ యాప్ లో సమస్యల తొలగింపు వంటి అంశాల లపై దృష్టి సారించామని పేర్కొన్నారు.

*ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ*  గ్రామ పంచాయతీ, మున్సిపల్ పాలక వర్గాలను భాగస్వామ్యం చేస్తూ 99 రోజుల కార్యాచరణ అమలు చేయాలన్నారు. గ్రామాలలో ఉన్న కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఫుడ్ సేఫ్టీ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, 

*కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబ శివరావు మాట్లాడుతూ* 20 సంవత్సరాల క్రితం ఇంటి క్రింద 20 వేలు మంజూరు చేసిన లబ్దిదారులకు నేడు ఇందిరమ్మ ఇండ్లు తిరస్కరిస్తున్నారని తెలిపారు. అర్హులకు రద్దు చేసిన ఇండ్లు కేటాయించాలని, జిల్లాలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించే సమయంలో అర్హులు అధికంగా ఉన్న పక్షంలో లాటరీ పద్ధతి అనుసరించా లని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్ది దశ నుంచి క్రీడలు భాగస్వామ్యం చేయాలని, పాఠశాల కరికులంలో క్రీడలు ఒక పార్ట్ గా మారాలని ఆయన సూచించారు. జిల్లాలో నిర్మించే డ్రైయిన్స్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయని, దీనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

*అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ మాట్లాడుతూ* ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. 

ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటిడిఎ పీవో బి. రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ