రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్లలో అరైవ్.. అలైవ్ కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ.   రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సీపీఆర్ ప్రథమ చికిత్స పై శిక్షణ, అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా, లోకల్ గైడ్ తెలంగాణ:
 
*వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ పేర్కొన్నారు.*
 
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ,రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ నుంచి వారోత్సవాల సందర్భంగా అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్ లో జిల్లాలోని ఆర్టీసీ, విద్యాసంస్థలు, ఆటో, మున్సిపల్, ఇతర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సీపీఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్,ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు.
 
 *ఈసందర్భంగా రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ మాట్లాడుతూ..*
ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహనాల డ్రైవర్లేనని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనల మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,అలాగే విద్యార్థుల రవాణాలో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ‘రహావీర్’ పథకం కింద ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను సమీప ప్రధాన రహదారుల వెండి ఉన్న ఆసుపత్రులకు తరలిస్తే, వారికి వారం రోజులపాటు ఉచిత చికిత్స అందిస్తూ.. రూ.1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని వివరించారు.ప్రమాద సమయంలో భయపడకుండా బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ‘రహావీర్’ పథకం కింద రూ.25,000 ప్రోత్సాహకం ఇస్తామని తెలిపారు. 
 
నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని, ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో రోజుకు సుమారు 70 రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయని అందులో 20 వరకు మరణాలు జరుగుతున్నాయని వెల్లడించారు.ఓవర్ స్పీడ్, తప్పుగా ఓవర్ టేకింగ్ చేయడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వాహనాలు 80 కిమీ వేగ పరిమితి లోపలే నడపాలని, ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఉన్న స్పీడ్ సైన్ బోర్డులను పాటించాలని సూచించారు. సీట్ బెల్ట్ ధరించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని హెచ్చరించారు. 
 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన *ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక* కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. దేశంలో గత ఏడాది 4,70,000 ప్రమాదాలు జరిగాయని,దానిలో 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యుద్ధాలు, వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడం లేదని, రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని పేర్కొన్నారు. తమ కుటుంబ, పిల్లల బాధ్యతను గుర్తు పెట్టుకొని జాగ్రతగా వెళ్లాలని పేర్కొన్నారు. 
 
ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్అండ్ బీ,పీఆర్,పోలీస్,రవాణా శాఖా,ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని,బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు,సైన్ బోర్డ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. డ్రైవర్లకు కంటి పరీక్షలతో ఎంతో మేలని, వైద్యుల సూచన మేరకు కంటి అద్దాలు వాడాలని సూచించారు.  
 
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ...ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటి ఆధ్వర్యంలో జిల్లాలో 08 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. కొదురుపాక బ్రిడ్జ్ చౌరస్తా, నందికమాన్ చౌరస్తా, వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ చౌరస్తా,సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా, పెద్దూర్,
ఎల్లారెడ్డిపేట హెచ్‌పి  పెట్రోల్ బాంక్ వద్ద, తంగళ్ళపల్లి పద్మనగర్,, సారంపల్లి లుగా గుర్తించడం జరిగిందని ఆయా ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని వాహనాదాహరులు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. జిల్లాలో వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సైకిల్ నడిపే పిల్లలు దానికి వాడే హెల్మెట్ వినియోగించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపవద్దని ఒకవేళ నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ చేయవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మేజర్లకే జాగ్రత్తలు చెపుతూ వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
 
*అనంతరం వాహనాల డ్రైవర్లతో కలసి రహదారి భద్రత పై ప్రతిజ్ఞ చేయించారు.*
 
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, 
తహసీల్దార్ మహేష్ కుమార్, సీ.ఐ లు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,మధుకర్,ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి, సురేష్,ఎస్.ఐ లు, పోలీస్, రవాణా శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!