విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
కొరకు సరళమైన సర్వీస్ లైన్ ఛార్జీల విధానం: ఎస్ ఈ వెల్లడి
By Ram Reddy
On
రాజన్న సిరిసిల్ల జిల్లా, లోకల్ గైడ్ తెలంగాణ:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రెగ్యులేషన్ నం. 1 ఆఫ్ 2026 ప్రకారం, విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతరం, పారదర్శకత కలిగించే విధంగా కొత్త సర్వీసుల కొరకు సర్వీస్ లైన్ ఛార్జీల (SLC) విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామని రాజన్న సిరిసిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ టీ వేణుమాధవ్ తెలిపారు.
కొత్త LT కనెక్షన్లు మరియు అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్ ఛార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. లోడ్ ఆధారంగా మాత్రమే ఛార్జీలు విధించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన అవసరం లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులు విద్యుత్ కనెక్షన్‌ను వేగంగా పొందగలరని, ముందుగా ఎంత ఛార్జీ చెల్లించాలో స్పష్టత ఉంటుందని చెప్పారు. అనవసర ఆలస్యం పూర్తిగా తగ్గుతుందని వివరించారు.
🔹 కొత్త ఛార్జీల ముఖ్యాంశాలు
20 కిలోవాట్ వరకు: డెవలప్‌మెంట్ ఛార్జీలు + సర్వీస్ లైన్ ఛార్జీలు వర్తించును .
20 కిలోవాట్ పైగా: కేవలం సర్వీస్ లైన్ ఛార్జీలు మాత్రమే (డెవలప్‌మెంట్ ఛార్జీలు లేవు)
🔹 కేటగిరీ వారీగా ఛార్జీలు
*గృహ వినియోగదారులు (LT-I)
1 కిలోవాట్ వరకు: ₹500
1–5 కిలోవాట్: ₹500 + ప్రతి కిలోవాట్‌కు ₹600
5–20 కిలోవాట్: ₹2900 + ప్రతి కిలోవాట్‌కు ₹1500
20 కిలోవాట్ పైగా: ప్రతి కిలోవాట్‌కు ₹10,000
*కమర్షియల్ కేటగిరీ:-
1 కిలోవాట్ వరకు: ₹1000
1–5 కిలోవాట్: ₹1000 + ప్రతి కిలోవాట్‌కు ₹1200
5–20 కిలోవాట్: ₹5800 + ప్రతి కిలోవాట్‌కు ₹2000
20 కిలోవాట్ పైగా: ప్రతి కిలోవాట్‌కు ₹10,000
ఇండస్ట్రీలకు 20కిలోవాట్ల వరకు 4000 ప్రతి కిలోవాట్
20 కిలోవాట్ పైగా: ప్రతి కిలోవాట్‌కు ₹10,000
ఇతర కేటగిరీలకు కూడా లోడ్ ఆధారంగా ఛార్జీల పెరుగుదల ఉంటుందని తెలిపారు.
🔹 రైతులకు లాభం
రైతులకు ఈ విధానం మరింత ప్రయోజనకరంగా ఉండి, 1 కిలోవాట్‌కు కేవలం ₹1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ( ఓఆర్సి వసూలు చెయ్యరు )
🔹 ప్రత్యేక అంశాలు
అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా ఛార్జీలు విధింపు
ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం ఉండదు
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే
> ఎల్టి క్యాటగిరి లో క్యాటగిరి I నుండి VII వరకు మరియు క్యాటగిరి IX కి వర్తిస్తుందని , 1 కిలో మీటర్ లోపు ఉన్న ఎలెక్ట్రీఫీడ్ నెట్వర్క్ నుండి, కేవలం ఓవర్ హెడ్ హెడ్ లైన్లకు మాత్రమే వర్తించును .
> 1 కిలో మీటర్ కి మించిన లైన్ ఎక్స్ టెన్షన్ , క్యాటగిరి VIII (తాత్కాలిక సరఫరా ) , లే అవుట్ ఎలెక్ట్రిఫికేషన్ , అండర్ గ్రౌండ్ కేబుల్స్ కు మినహాయించారు .
ఈ కొత్త విధానం ద్వారా విద్యుత్ కనెక్షన్ పొందడం మరింత సులభం, వేగవంతం మరియు పారదర్శకంగా మారిందని, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఎస్ఈ వివరించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
