రైతు భరోసా” పథకం కింద కొత్త దరఖాస్తులు చెసుకొండి.
షాద్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్ నర్సింహారెడ్డి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్,
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “రైతు భరోసా” పథకం (యాసంగి 2025-26) కింద కొత్త దరఖాస్తులు మరియు బ్యాంక్ వివరాల అప్‌డేట్‌కు అవకాశం కల్పించినట్లు షాద్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్ నర్సింహారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో , 28-02-2026 వరకు కొత్త పట్టాదార్ పాస్‌బుక్ పొందిన రైతులు మరియు ఇప్పటివరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు, అలాగే బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతులు తమ దరఖాస్తుల కోసం రైతు భరోసా అప్లికేషన్ ఫారం, పట్టాదార్ పాస్‌బుక్ (PPB) కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జీరోక్స్, మొబైల్ నంబర్ వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
అలాగే రైతువేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఈ నెల 25-03-2026 చివరి తేదీ కావున అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకుని రైతు భరోసా ప్రయోజనాన్ని పొందాలని ఆయన కోరారు.
