రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి నుంచి తరలి వెళ్లిన

రైతులు, కాంగ్రెస్ శ్రేణులు

రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి నుంచి తరలి వెళ్లిన

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ) 

మార్చి22:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి మండలం నుంచి భారీ సంఖ్యలో రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. రైతుల విశేష స్పందనతో నర్మెట్ట గ్రామం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది.
అక్బర్‌పేట భూంపల్లి మండలం నుంచి సమూహాలుగా తరలివచ్చిన రైతులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై తమ మద్దతును ప్రకటించారు. రైతు ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పొందడంతో పాటు, ఆయిల్ పామ్ సాగు వంటి నూతన వ్యవసాయ విధానాలపై ఆసక్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల ఉపాధ్యక్షులు ముత్తంగి భూమయ్య, ఉపసర్పంచులు జీడిపల్లి రమేష్, రాసమల్ల స్వామి, మాజీ సర్పంచ్ ఆరుట్ల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్లపల్లి బాల గౌడ్, మల్లేశం పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూతురు కుమారస్వామి, కోరండ రవీందర్ రెడ్డి, భూంపల్లి భీం రావు, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, ఉత్తం నరేష్ తదితరులు హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News