ఆర్టీసీ నిర్మల్ డిపోను సందర్శించిన నూతన

ఆర్.ఎం.విజయబాను.

ఆర్టీసీ నిర్మల్ డిపోను సందర్శించిన నూతన

 
నిర్మల్ జిల్లా ప్రతినిధి. (లోకల్ గైడ్) .. ఏప్రిల్..1

ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ కు నూతనంగా బదిలీపై వచ్చిన రీజినల్ మేనేజర్ విజయబాను ను నిర్మల్ డిపో మేనేజర్ కే.పండరి శాలువతో సత్కరించి బొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు.
ఇటీవలే ఆదిలాబాద్ నుండి భవానీ ప్రసాద్ వరంగల్ కు బదిలీ పై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ ఆర్.ఎం.విజయబాను ఆదిలాబాద్ రీజియన్ కు బదిలీ పై వచ్చారు.
నిర్మల్ డిపో అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు.పలు రికార్డులు పరిశీలించినారు.
కార్యక్రమములో ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ ( ఓ) శ్రీ హర్ష రీజినల్ మేనేజర్ ( ఎమ్)  రామయ్య, రీజినల్ సహాయ మేనేజర్ రాజశేఖర్, నిర్మల్ అసిస్టెంట్ ఇంజనీర్ ( ఎమ్)  నవీన్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News