అంగరంగ వైభవంగా ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణ.

​మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ  పేదల పెన్నిధి ఇందిరమ్మ అని అన్నారు.

అంగరంగ వైభవంగా ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణ.

లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి

​కామారెడ్డి పట్టణ నడిబొడ్డున రైల్వే స్టేషన్ సమీపంలోని ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ కలిసి ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా ​మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ 
పేదల పెన్నిధి ఇందిరమ్మ అని అన్నారు.తన ప్రసంగంలో ఇందిరా గాంధీతో కామారెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ​కామారెడ్డి అంటేనే కాంగ్రెస్ కోట అని, ఇక్కడ ఇందిరా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.
​గరీబీ హటావో దేశ్ కో బచావో నినాదంతో ఆమె దేశంలోని నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపారనీ అన్నారు.
బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ధీశాలి ఆమె అని కొనియాడారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యంలోని సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని హామీ ఇచ్చారు.
​ఇంచార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఆద్యురాలు
​ఇందిరా గాంధీ అని 
​ఆడబిడ్డల ఆత్మగౌరవం దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ మహిళల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ​ఇందిరమ్మ రాజ్య స్థాపన
నేడు తెలంగాణలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం 'ఇందిరమ్మ రాజ్యం' దిశగా అడుగులు వేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు నీడ కల్పిస్తున్నామని తెలిపారు.
​ధైర్యానికి మారుపేరు ఉక్కు మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ దేశానికి దిక్సూచి అని, ఆమె చూపిన బాటలోనే తాము నడుస్తున్నామని తెలిపారు.
​టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 
ప్రభుత్వ సిద్ధాంతమే ఇందిరమ్మ మార్గం అని
దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.
​కామారెడ్డి గడ్డపై ఇందిరమ్మ విగ్రహం సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని కోరారు. ​ ఆనాడు ఇందిరమ్మ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకమే నేడు అనేక సంక్షేమ పథకాలకు పునాది అని గుర్తు చేశారు. ​ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఎవరు మాట్లాడుతూ ​ఇందిరా గాంధీ  ఒక వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి. 
ఆమె దూరదృష్టి వల్లే నేడు దేశం ఆహార భద్రతలో స్వయం సమృద్ధి సాధించింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో ఆమె పథకాల గుర్తులు ఉన్నాయి.
ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు