సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు    .

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు    .

జగిత్యాల జిల్లా ప్రతినిధి,ఫిబ్రవరి 21 ( లోకల్ గైడ్ ):
సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం, పెన్షనర్స్ సర్వీస్ రూల్స్ పుస్తకాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. 
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో రూ. కోటి రూపాయలతో తారకరామ నగర్ లో ప్రభుత్వ వృద్దాశ్రమాన్ని ఏర్పాటు చేశామని, అలాగే జగిత్యాల పట్టణ బై పాస్ రోడ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు జరిగిందని, అందులో సీనియర్ సిటిజెన్లకు ఉచితంగా అల్పాహారం, వైద్య సేవలు, వినోద కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
వయో వృద్ధుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పాటు పడుతున్న సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను, వారి సంఘాల ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. 
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాతం, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి  పి. సి. హన్మంత్ రెడ్డి,  సీనియర్ సిటిజెన్స్  ఉపాధ్యక్షులు పి.అశోక్ రావు, కోశాధికారి వి. ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి ఎం. డి. యాకూబ్, నాయకులు కొక్కుల ఆంజనేయులు, బాలయ్య,కౌన్సిలర్ క్యాదసు నవీన్ , కొలగని సత్యం,బక్కశెట్టి అంజన్న,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..