ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 6 :
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ( కారేపల్లి ) తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ది. 8 మార్చి 2026 నాడు 27 వ వార్షికోత్సవమును ఘనంగా నిర్వహించుట కొరకు మండల అధ్యక్షుడు గండమాల వెంకటేశ్వర్లు తన తోటి గ్రామీణ వైద్యుల బృందం తో శుక్రవారం రోజునా వివిధ కార్యక్రమాల నిమిత్తం మండలానికి వచ్చినటువంటి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను మార్యదపూర్వకంగా కలిసి గ్రామీణ వైద్యుల సింగరేణి మండల 27 వ వార్షికోత్సవనీకి తప్పకుండ హాజరు కావాలని విన్నవించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే హామీ ఇస్తూ గత సంవత్సరం 2025 లో అనేక కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోయినందున ఈ సంవత్సరం వేడుకలకు తప్పకుండా హాజరైతిరుతాను అనీ హామీ ఇవ్వడం జరిగింది... తదనంతరం స్థానిక కారేపల్లి పోలీస్ స్టేషన్ సీ ఐ నునవత్ సాగర్ , ఎస్సై బైరు. గోపి ను కూడా 27 వ ఉత్సవాలకు హాజరై నిషా నిద్దేశించవలస్సిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమం లో తోటి గ్రామీణ వైద్యుల బృందం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ దేవస్థాన, సొసైటీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది.