ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.

ఎకో హిల్ పార్క్ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి 

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.

శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్);

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్వాల్ గూడ ప్రాంతంలో నూతనంగా ఎకో హిల్ పార్కు ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సినిమా షూటింగ్ ల కోసం విదేశాలకు పోతున్నారు అని తెలిపారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశం లోనే లేదన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని వెల్లడించారు.
చంద్రబాబు,వైఎస్ సమయం లో నగరానికి కృష్ణా,గోదావరి నీళ్లు నగరానికి తీసుకు వచ్చారన్నారు. నాటి నిజాం నవాబు  ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తో వరదల నివారణకు మూసి పైన నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు.వికారాబాద్ లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్ లు నాటారని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్,గోల్కొండ,అసెంబ్లీ లాంటి చారిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఆక్రమణలు ,చెత్త తో నిండి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్  నగరాన్ని మంచి గా చేస్తానంటే ప్రతిపక్షాలు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. మేము చేయలేదు నువ్వు చేయొద్దని అంటున్నారు ...వాళ్లకు ఫార్మ్ హౌస్ లు  ఫార్మ్ హౌస్ లు వచ్చాయనీ అన్నారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపినట్లు వెల్లడించారు.
విమానాశ్రయం కట్టే సమయం లో కొంత వ్యతిరేకత వచ్చింది..కానీ ఇప్పుడు పెద్ద ఆస్తి గా మారిందన్నారు.

శంషాబాద్ బుల్లెట్ ట్రైన్...

శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారబోతుంది ..
బెంగళూరు,అమరావతి,చెన్నై కి ఇక్కడి నుంచే బుIMG-20260306-WA0301ల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుందనీ తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ లు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుంది..
వాళ్ళను అనాథలను చేయం.
భూమి,ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
ప్రపంచం లోనే గొప్ప నగరం గా తీర్చి దిద్దుతాం. ట్రంప్,ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ల సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి. ప్రపంచం తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం.
గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు.
అక్క చాలా కాలం మంత్రి గా పనిచేసింది..ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వాళ్ళ ను వీళ్లను తీసుకొచ్చి విమర్శిస్తుందనీ వివరించారు.
అక్క కుటుంబానికి 40 సంవత్సరాలు అండగా ఉన్న ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నది.
ఏం చేసినా కేటిఆర్ అడ్డు పడుతున్నాడనీ విమర్శించారు.
హైదరాబాద్ లో ముసి రివర్ ప్రంట్ ఏర్పాటు చేస్తాం. మూసి పక్కన నైట్ ఎకనామిని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తా  మన్నారు.ఆయా నియోజకవర్గం లో నే ప్రభుత్వ స్థలాలను చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం అని తెలిపారు. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశాం..సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇందిరమ్మ చీరల్లో ఆడ బిడ్డలు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారు..గతం లో ఇచ్చిన బతుకమ్మ చీరలను పిట్టలు కొట్టడానికి వాడారు..ఈ సారి ఇందిరమ్మ చీరలను మరో రంగులో ఇస్తా మన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ,మల్ రెడ్డి రంగారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..