మిర్యాలగూడ ఫిబ్రవరి 21
(లోకల్ గైడ్ తెలంగాణ)
కె ఎన్ ఎం డిగ్రీ కళాశాల మిర్యాలగూడ అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు రోజుల జాతీయ వర్క్ షాప్ ముగింపు దశకు చేరుకుంది ఈ ముగింపు ప్రోగ్రాంకు విశిష్ట అతిథిగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరీ శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. సభాధ్యక్షులుగా కళాశాల శ్రీ భీమార్జున రెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అయిన గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లర్స్ యొక్క పాత్ర ఎంతో క్రియాశీలకమైనదని పట్టణ అభివృద్ధి మాత్రమే కాదు వ్యాపారాభివృద్ధి మాత్రమే కాదు సామాజిక బాధ్యతతో కూడిన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పాత్ర మరువలేనిది అని తెలియజేశారు. కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాల మిర్యాలగూడలో జరుగుతున్న క్వాంటిటీ టు టెక్నిక్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఎకనామిక్స్ అనే వర్క్ షాప్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నేను అధ్యాపకుల యొక్క ఆలోచన సరళిని తెలుసుకోవడం అదేవిధంగా అధ్యాపకులు నిరంతర విద్యార్థులుగా మారి కళాశాలలో ఇలా ట్రైనింగుకు రావడం అనేది మంచి శుభ పరిణామం అని ఈ విధంగా అధ్యాపకులు ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా విద్యార్థులకు సులభంగా పాఠాలు బోధించడానికి అవకాశం కలుగుతుందని ఈ వర్క్ షాప్ నిర్వాహకుడైన డాక్టర్ గుమ్మడి నరేష్ యొక్క విశేషమైన కృషిని ఇందుకు అభినందిస్తున్నానని గతంలో కూడా నరేష్ నేషనల్ సెమినార్ లో కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యొక్క పాత్ర ఉండిందని తెలియజేశారు. కేఎన్ఎం కళాశాలలో నరేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ నిజంగా అభినందనీయమని భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమంలో కూడా తమ పాత్ర ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ నిర్వాహకుడు డాక్టర్ గుమ్మడి నరేష్ మాట్లాడుతూ కళాశాలలో తనకు ఇంతటి సౌకర్యాలు కల్పించి తన వెన్నంటి ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి సార్ కి తను ఎల్లవేళలా రుణపడి ఉంటానని అంతేకాక తన ప్రతి అడుగులో అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా ప్రిన్సిపల్ ప్రోత్సహిస్తున్నారని దాని ద్వారానే ఇంతటి ఉన్నత శిఖరాలను సాధించడం సాధ్యమవుతుందని ప్రిన్సిపాల్ కి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అంతేకాక ఈ వర్క్ షాప్ నిర్వహణకు ప్రోత్సహించిన రూసా స్టేట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ మేడంకు తెలంగాణ ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ బాల భాస్కర్ సార్ కి అదేవిధంగా కళాశాలలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ వారికి అలాగే వర్క్ షాప్ లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యాపకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి మాట్లాడుతూ వర్క్ షాప్ నిర్వహణ అంత సులభమైనది కాదు ఈ వర్క్ షాప్ నిర్వహణలో చలాకిగా ఉంటూ డిపార్ట్మెంట్ ని అభివృద్ధిని చేస్తున్నందుకు డాక్టర్ గుమ్మడి నరేష్ ని అభినందించారు. ఈ సందర్భంగా గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ కేఎన్ఎం కళాశాల స్థాపించిన దగ్గర నుంచి అది అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్న ప్రతి దశలో కూడా మా మిల్లర్స్ అసోసియేషన్ యొక్క ముద్ర ఉందని కేఎన్ఎం కళాశాల అభివృద్ధికి గతంలో కాదు భవిష్యత్తులో కూడా తమ వెన్నుదన్నులు ఉంటాయని కళాశాల సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ పార్టిసిపెంట్స్ మాట్లాడుతూ కేఎన్ఎం కళాశాల సిబ్బంది వారి యొక్క హాస్పిటాలిటీ అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ యొక్క ఆర్గనైజేషన్ డాక్టర్ గుమ్మడి నరేష్ టైం టేబుల్ రిసోర్స్ పర్సన్ ల ఎంపిక ప్రోగ్రాంను నడిపించిన విధానము అధ్యాపకులకు ఒక కొత్త వరవడిని సృష్టించింది వారు క్లిష్టతరమైన టాపిక్స్ లలో రిసోర్స్ పర్సన్ లతో ఇంటరాక్ట్ అయి సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా విద్యార్థులకు సులభంగా పాఠాలు చెప్పడానికి సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం తనకు మరొక కొత్త అనుభవాన్ని ఇచ్చిందని భవిష్యత్తులో ఇంతకంటే విస్తృత కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేఎన్ఎం కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డి దయానందం పాల్గొన్నారు.