కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన  

ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక.

కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన  

 మిర్యాలగూడ మార్చి 6
 (లోకల్ గైడ్ తెలంగాణ )

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుండి ప్రారంభమై జూన్ 12 వరకు 99 రోజుల పాటు అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని  కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి, నోడల్ అధికారి పి. నాగరాజు ప్రారంభించారు. ప్రిన్సిపల్ భీమార్జున రెడ్ది మాట్లాడుతూ మొదటి పదిరోజుల పాటు అనగా మర్చి 6 నుండి 15 వరకు  ప్రణాళికను తయారు చేసుకొని, కమిటీల ద్వారా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేరువ కావడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థల్లో సేవలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, శుభ్రతా కార్యక్రమాలను నిర్వహించడం,  పెండింగ్ ఫైల్స్, పరిపాలనా పనులను త్వరగా పూర్తి చేయడం, కళాశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసి  విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు కళాశాల ఆవరణను శుభ్రపరిచారు.
  ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారులు శ్రీనివారావు, స్వప్న , ఎన్.సి.సి. సి.టి.ఒ. నరేష్  అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ