రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి
: సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య.
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 5 (లోకల్ గైడ్)
రైతుభరోసా నిధులను తక్షణమే విడుదల చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని *సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వన్నీ ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకంపై గొప్పలు చెప్పుకుంటున్నవ్పటికీ, ఆచరణలో మాత్రం విఫలమైంది. జిల్లాలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికీ నిధులు జమ కాక పోవడంతో ఆర్థికఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలుగా ప్రకటించి, రూ.12 వేలకు కుదించి, అది కూడా రెండు ఎకరాల వరకు పూర్తిగా అందించలేకపోయారు. రైతుభరోసా నిధుల విడుదలలో కొనసాగుతున్న ఆలస్యం రైతులను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లలో పంట పెట్టుబడికి అందాల్సిన సాయం ప్రతి ఏడాది ఆలస్యమవుతుండటంతో రైతులు ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు పూర్తయ్యాక వెంటనే రైతుభరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రకటన అమలు కాలేదు.ఫిబ్రవరి నెల 17న నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్న ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించినా, దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో రైతులు ఆశగా ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటిపోయినా, పంట పెట్టుబడిసాయం అందక రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు ప్రయివేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. కొందరు రైతులు అధికవడ్డీకి అప్పులు తెచ్చి తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని లేనియెడల రైతులతో కలిసి ఆందోళన చేపడతామని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Tags:
About The Author
Latest News
17 Mar 2026 18:21:52
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
