బీసీల హక్కుల సాధన కోసం బీసీ సేన పోరాడుతుంది. 

జిల్లేడు చౌదరిగూడెం మండల బీసీ సేన అధ్యక్షులు బోయ చెన్నయ్య.

గాలిగూడెంలో బీసీ సేన గ్రామ కమిటీ ఎన్నిక. 

లోకల్ గైడ్, జిల్లేడు చౌదరిగూడె.   బీసీల హక్కుల సాధన కోసం బిసి సేన ముందుండి పోరాడుతుందని జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షులు బోయ చెన్నయ్య అన్నారు.బుధవారం మండల పరిధిలోని గాలిగూడ గ్రామంలో బిసి సేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం పోరాట బిసి సేన అద్వర్యంలో కార్యక్రమాలను చేపడుతుందని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా బీసీ సేనతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటల వరకే తప్ప ఆచరణలో ఏ మాత్రం అడుగు ముందుకు పడటం లేదని వారన్నారు. ఎంతోమంది నాయకులకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన బీసీలు వారికి కావాల్సిన హక్కులను కల్పించడంలో వెనుకంజ వేస్తున్నారని బీసీలుగా మనమందరం ఐక్య మత్యంగా బిసి సేనతో మన హక్కులను సాధించుకునేందుకు కలిసి పోరాడుదామని మండల అధ్యక్షులుబోయ చెన్నయ్య పిలుపునిచ్చారు. అనంతరం గాలి గూడ గ్రామంలో బిసి సేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షునిగా పాశం యాదగిరి, ఉపాధ్యక్షునిగా సంఘన్న, జంబుల పెద్ద వెంకటయ్య ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారి పాశం తిరుపతయ్య,కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేకల వెంకటేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో బిసి సేన మండల అధ్యక్షులు బోయ చెన్నయ్య, మేకల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు, మండల మహిళా బీసీ సేన అధ్యక్షురాలు ప్యాట జయశ్రీ, మండల ఉపాధ్యక్షులు అమృతం దామోదర్, రాఘవేందర్ ,చౌదరి గూడ గ్రామ బిసి సేన అధ్యక్షులు పుర్ర రాజు, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News