ఓల్డ్ హఫీజ్ పేట్ జామియా మసీద్ సమస్యలపై

పిఏసి చైర్మన్ అరికెపూడి గాంధీని కలిసిన గౌతం గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు

ఓల్డ్ హఫీజ్ పేట్ జామియా మసీద్ సమస్యలపై

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ జామియా మసీద్ కమిటీ సభ్యులు బుధవారం పిఏసి. చైర్మన్ అరికెపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మసీదుకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు, స్థానిక అభివృద్ధి అంశాలను కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మసీదు పరిసరాలలో అంతర్గత రోడ్డు నిర్మాణం, యుజిడి పైపులైన్ సహా ఇతర మౌలిక సదుపాయాల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. సభ్యుల విన్నపాలకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జామియా మసీద్ కమిటీ కోరిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి, త్వరితగతిన పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు మున్నాభాయ్, ఎస్.కె.నజీర్ (లిమ్రా), గౌస్, అక్రమ్, ఇబ్రహీం, అజం, నజీర్, మౌలిసాబ్, స్థానిక నాయకులు, ఇతర ముఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు