భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
క్యూఆర్ కోడ్, ఆన్ లైన్ లింక్‌తో భక్తులకు సౌకర్యాలు, 2000 మంది పోలీసులతో బందోబస్తు
ఎస్ పీ రోహిత్ రాజు
కొత్తగూడెం : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ నెల మార్చి 27, 28 తేదీలలో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మండపం, సెక్టార్లు, లడ్డూ మరియు తలంబ్రాల కౌంటర్లకు భక్తులు సులభంగా చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, ఆన్లైన్ లింక్‌ను రూపొందించామని తెలిపారు. https://ramanavami.4sightai.com/� లింక్ ద్వారా భక్తులు తాము చేరవలసిన ప్రదేశాలను సులభంగా గుర్తించి చేరుకోవచ్చని వివరించారు. సుమారు 2000 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అందరూ పోలీస్ శాఖకు సహకరించి, ట్రాఫిక్ నియంత్రణ కోసం విధించే ఆంక్షలను గౌరవించాలని ఎస్ పీ కోరారు. భద్రాచలం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
