నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా

పెన్షనర్ల బకాయిలను వెంటనే ఇవ్వాలి

నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా

టాప్ రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి.

 మిర్యాలగూడ  మార్చి 24 
( లోకల్ గైడ్ తెలంగాణ )

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న వ్యాలీ డేషన్ ఆక్ట్ కు వ్యతిరేకిస్తూ బుధవారంనాడు ఇందిరాపార్క్ వద్ద జరగనున్న  ధర్నాను జయప్రదం చేయాలని టాప్రా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం నాడు స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లపై కక్ష సాధింపు గా వ్యవహరిస్తుందని అందులో భాగంగానే పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్  రెండు భాగాలుగా విభజించిందని     2025 వరకు పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఒక విధానం 2026 లో విరమణ చేసిన ఉద్యోగులకు మరొక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఇది పెన్షనర్ల జీవితాలతో చెలగాటమని ఆయన అన్నారు. ఈ విధానం నాగా ర  జడ్జిమెంట్కు వ్యతిరేకమని ఆ జడ్జిమెంట్ లో  పెన్షన్ అనేది ఉద్యోగ విరమణ చేసిన వారి  హ క్కని  పేర్కొన్నట్టు గుర్తు చేశారు. గతంలో సిపిఎస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేదని అటుపమట దేశంలోని అన్ని రాష్ట్రాలలో దాన్ని అమలు చేశారని కనుక పార్లమెంటులో ప్రవేశపెట్టావాలనుకుంటున్న పెన్షన్ విధానాలను అమలు చేస్తారని అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సిపిఎస్ ను నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2024 నుండి అమలు చేసిందని వారు తెలిపారు.
ఈ పెన్షన్ల సాధన కొరకు ఎన్సిసిపిఏ అదే విధంగా సివిల్ పే అసోసియేషన్ రెండు ఆర్గనైజేషన్లు న్యాయపోరాటం చేస్తుందని అందులో భాగంగానే ఈనెల 25వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా తలపెట్టామని ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు. సి పి సి ని అమలు చేయాలని అది అమలు అయ్యేంతవరకు ఫిట్మెంట్ ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2024 లో పదవి విరమణ చెందినవారికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం చెప్పినట్లుగా బకాయిలను ప్రతినెల 700 కోట్లు కాకుండా 1000 కోట్లు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు పెంచాలని అన్నారు. 2600 మంది పెన్షనర్లు హైకోర్టుకు తమ బకాయిల కొరకు వెళ్లారని అలాంటి వారికి ఏప్రిల్ 9వ తేదీ వరకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు దుర్వాసన తీర్పులిచ్చిందని దానికి రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రెటరీ అంగీకరించినట్టు తెలిపారు. పెండింగ్ లోనున్న ఐదు డిఏలను పిఆర్సిని వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈహెచ్ఎస్ పథకంలో గురుకులాల్లో పని చేస్తున్న  లైబ్రరీలో పనిచేస్తున్న  వారికి సంస్థలలో పనిచేస్తున్న వారికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో టాప్రా నాయకులు జగదీష్ చంద్ర శ్యాంసుందర్ అబ్దుల్ ఖాదర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News