మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ....

శుభాకాంక్షలు తెలిపిన 

మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ....

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుస్, కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా

కాజీపేట/హనుమకొండ  మార్చి12(లోకల్ గైడ్ న్యూస్)*:

మహిళల శక్తివంతమైన భాగస్వామ్యం తో తెలంగాణ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహిళ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ని హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుస్ షాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ; ఎర్రబెల్లి స్వర్ణ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ మరింత అభివృద్ధి చెందుతూ మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం మహిళా కాంగ్రెస్ బలంగా పని చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా మహమ్మద్ పాల్గొని ఎర్రబెల్లి స్వర్ణ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ మరింత విస్తరించి, మహిళల అభివృద్ధి కోసం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News